సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఇరాన్‌ గ్యాస్ రంగంలో చైనా 40 బిలియన్ల పెట్టుబడులు! (China | invests USD | Iran oil | gas | Tehran | Islamic republic)
Bookmark and Share Feedback Print
 
ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్‌లో 40 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా ముందుకు వచ్చింది. ఇరాన్ ఆయిల్, గ్యాస్ రంగాల్లో చైనా పెట్టుబడి పెట్టనున్నట్టు ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

దీనిపై ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హోస్సేన్ నూక్‌రేఖర్ షిరాజ్ మాట్లాడుతూ ఇరాన్ నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ఆయిల్‌ ఎగుమతులు గత యేడాదితో పోల్చుకుంటే ఈ యేడాది తొలి ఆరు నెలల్లో 30 శాతం మేరకు పడిపోయినట్టు చెప్పారు.

అయినప్పటికీ.. ఈ రంగంలో చైనా 29 బిలియన్ అమెరికా డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు. అలాగే, మరో పది కోట్ల బిలియన్ డాలర్లను పెట్రో కెమికల్స్, రీఫైనరీస్, ఆయిల్, అండ్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుందని చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.