ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జెర్మనీ గత 23 ఏళ్లుగా ఎన్నడూ లేనటువంటి అద్భుతమైన స్థూల జాతీయ ఉత్పత్తి రేటు(జీడీపీ)ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో జర్మనీ స్థూల దేశీయ ఉత్పత్తి రేటు(జీడీపీ) 2.2శాతానికి పెరిగినట్లు తెలిపింది.
గడచిన 23ఏళ్ళతో పోలిస్తే ఈ స్థాయిలో పెరగటం ఇదే మొదటిసారి. వివిధ కంపెనీల పెట్టుబడులు పెరగడంతో పాటు, దేశీయ ఎగుమతులు కూడా పెరగడంతో జీడీపీ వృద్ధి రేటు భారీగా పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ప్రకారం రెండో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 4.1శాతంగా ఉంది.