సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఆంధ్రాబ్యాంకు ఉద్యోగుల సమ్మె: ఆరు రోజులు బంద్! (Strike | Bandh | Andhra Bank Employees | State wide bandh)
Bookmark and Share Feedback Print
 
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ సెప్టెంబర్ 28 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు మూతపడనుంది. ఉద్యోగులపై యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరనగా బ్యాంకు ఉద్యోగులు మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు.

సెప్టెంబర్ 28నుంచి ఈ సమ్మెను ప్రారంభించాలని ఉద్యోగులు నిర్ణయించారు. సెప్టెంబర్ 28, 29, అక్టోబర్ ఒకటో తేదీన సమ్మె జరుపుతారు. అయితే సెప్టెంబర్ 30వ తేదీ బ్యాంకు రెండవ త్రైమాసికం ముగింపు (అర్థ సంవత్సర ముగింపు) కావడంతో.. ఆ రోజు బ్యాంక్‌కు సెలవు దినం.

అక్టోబర్ 1న సమ్మె జరుపుతారు కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులో కార్యకలాపాలు సాగవు. మరుసటి రోజు.. అంటే అక్టోబర్ 2వ తేదీ నాడు గాంధీ జయంతి కావడంతో బ్యాంకుకు సెలవు దినం. అక్టోబర్ 3వ తేది ఆదివారం రావడంతో మొత్తంగా ఆరు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు కార్యకలాపాలు స్థంభించిపోనున్నాయి.

తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆంధ్రాబ్యాంకు ఉద్యోగలు గత ఆరు నెలలుగా తమ నిరసనలు తెలయజేస్తూనే ఉన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంకు గత ఏడాదితో పోలిస్తే 25.05 శాతం వృద్దిని సాదించిం రూ.320.41 కోట్ల నికర లాభాలను ఆర్జించించిన సంగతి తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.