సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » సెప్టెంబర్‌లో ఉక్కు ధరలు పెరగొచ్చు: ఉక్కు కంపెనీలు! (Steel prices | tonne | Tata Steels | JSW Steels | SAIL | Chairman)
Bookmark and Share Feedback Print
 
వర్షాకాలం ముగుస్తుండటంతో స్టీల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ఉక్కు ధరలు టన్నుకు రూ. 1,000 చొప్పున పెరిగే అవకాశం ఉంది. "ప్రస్తుం ఉక్కుకు మార్కెట్‌లో పాజిటివ్ ట్రెండ్ ఉంది. డిమాండు కూడా పెరుగుతంది. దీంతో ధరలు కూడా అంజర్జాతీయ ట్రెండ్‌ను అనుసరించాలి. వచ్చే నెలలో స్టీల్ కంపెనీలతో జరిగే సమావేశంలో చైనా వంటి దేశాల నుంచి దిగిమతి చేసుకుంటున్న ధరలను పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటాం." అని సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ తెలిపారు.

అయితే ఈ ధరల పెరుగదల టన్నుకు దాదాపు రూ. 1,000 వరకూ పెరగవచ్చని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం సగటున ఉక్కు ధరలు టన్నుకు రూ. 30,000 నుంచి రూ. 35,000 మధ్య ఉంది. "ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి గత కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ధరలు టన్నుకు 50 డాలర్లకు చేరుకుంది. ఇన్‌పుట్ ధరలపై కూడా ఒత్తిడి పెరగడంతుంది" అని జెఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ (కమర్షియల్, మార్కెటింగ్) జయంత్ ఆచార్య అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.