ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » సత్యం ఎండి, మరో నలుగురికి సుప్రీం కోర్టు నోటీసులు (Accounting fraud | Notice issues | Satyam fraud | Rama Raju | Supreme Court)
ప్రముఖ ఐటీ కంపెనీ "సత్యం"లో జరిగిన రూ. 14,000 కోట్ల కుంభకోణంలో సత్యం మాజీ మేనేజింగ్ డైరెక్టర్ బి. రామరాజుతో పాటు మరో నలుగురికి సుప్రీం కోర్టు నోటీసు ధాఖలు చేసింది. వీరికి ఇచ్చిన బెయిల్‌ను ఎందుకు రద్దు చేయలేదన్ని అందులోని సారాంశం. జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ దల్బీర్ భాంద్రిలతో కూడిన ధర్మాసనం సీబీఐ ఫైల్ చేసిన ఈ ఐదుగురి నిందుతులకు నోటీసులు జారీ చేసింది.
కాగా.. గత జులైలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రామరాజు, అతని సోదరుడైన సత్యం వ్యవస్థాపకుడు బి రామలింగరాజు, సత్యం మాజీ సీఎఫ్ఓ వి. శ్రీనివాస్‌లతో పాటు సత్యంకు చెందిన మరో ముగ్గురు ఐటీ ఉద్యోగులు జి. రామకృష్ణ, వెంకటపతి రాజు, సీహెచ్ శ్రీశైలంలకు బెయిల్ మంజూరు చేసింది. గత గతేడాది రామలింగ రాజు, రామరాజుతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.