సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » డిపాజిట్ రేట్లు పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..! (Punjab National Bank | PNB | Fixed deposit rates | Lending Rates)
Bookmark and Share Feedback Print
 
ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లకు పెంచుతున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది. తాజాగా పెంచిన ఈ రేట్లు సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు అందిస్తున్న రెండు స్లాబులపై ఈ పెంపుదల అమలులోకి వస్తుంది.

కొత్తగా పెంచిన ఈ బేస్ రేటు ప్రకారం 180-270 రోజుల పాటు చేసిన టెర్మ్ డిపాజిట్లపై ప్రస్తుతం 5.75శాతంగా ఉన్న రేటు ఆరు శాతానికి, అదే ఒకటి నుంచి రెండు సంవత్సరాలు కాల పరిమితిలో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7శాతానికి పెరిగాయి.

ఈ నెల ఆరంభంలో బ్యాంకు రుణాలపై 11శాతంగా ఉన్న వడ్డీ రేట్లను అదనంగా మరో 75 బేసిస్ పాయింట్లకు పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకు వడ్డీ రేటు 11.75గా ఉంది. అంతే కాకుండా సెప్టెంబర్ ఒకటి నుంచి బ్యాంకు పీఎన్‌బీ డుంగా, పీఎన్‌బీ లక్‌పతి అనే రెండు ప్రత్యేక డిపాజిట్ స్కీములను ప్రవేశపెట్టనుంది. ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ కింద బ్యాంకు గృహ రుణాలను 8.5శాతం వడ్డీకే ఇస్తున్న సంగతి తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.