సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఆర్థిక మాంద్యం నుంచి బయటపడుతున్నాం: రోశయ్య (Andhra Pradesh | Economic Recession | K Rosaiah | Meltdown)
Bookmark and Share Feedback Print
 
రాష్ట్రం ఆర్థిక మాంద్యం నుంచి బయటపడుతోందని, గడచిన త్రైమాసికం నుంచి రాష్ట్ర ఆదాయం వృద్ధిని సాధిస్తుందని ముఖ్యమంత్రి రోశయ్య తన కార్యాలయంలో తెలిపారు. ప్రత్యేక తెలంగాణ వాదం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించిన ఫలితంగా కొన్ని రంగాలలో పెట్టుబడులు సన్నగిల్లాయని రోశయ్య అన్నారు.

డిసెంబర్ 2009 - మార్చి 2010 మధ్య కాలంలో ప్రత్యేక తెలంగాణా వాదం పెట్టబడులపై తీవ్ర ప్రభావం చూపిందని, కేంద్రం ఐదుగురి సభ్యులతో కూడిన శ్రీకృష్ణ కమిటీ నియమించిన అనంతరం పెట్టుబడుల సరళి మళ్లీ ఊపందుకుందని, ఈ పెట్టుబడులు ఐటీ మరియు ఇతర రంగాల్లో వెచ్చిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితి సంతృప్తికరంగా ఉందని ఆయన అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.