సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మార్కెట్‌లోకి నోకియా "డ్యూయల్‌ సిమ్‌" ఫోన్లు (Mobile Phones | Dual Sim Phones | Nokia | Samsung | Cell Phone | Sim Card)
Bookmark and Share Feedback Print
 
దేశీయ మొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న "నోకియా" మొదటిసారిగా రెండు "డ్యూయల్ సిమ్ కార్డ్" మొబైల్ ఫోన్ మోడళ్లను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది. ఇప్పటికే పలు చిన్న కంపెనీలు ఇటువంటి సదుపాయాలు ఉన్న ఫోన్లను చవక ధరకే అందిస్తున్న నేపథ్యంలో నోకియా ఈ విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా ఈ మోడళ్లను సిద్ధం చేసింది.

నోకియా సీ1 (సీ1-100), నోకియా సీ2 పేర్లతో నోకియా నూతన ఫోన్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్‌లో సీ1 ధర రూ. 1,999గా ఉన్నట్లు తెలిపింది. ఈ ఫోన్‌లో ఫ్లాష్‌లైట్, ఎఫ్ఎమ్ రేడియో, కాల‌్‌డైవర్ట్ వంటి సదుపాయాలున్నాయి. అయితే సీ2 మోడల్ కోసం మాత్రం ఈ ఏడాది చివరి వరకూ వేచి చూడాల్సిందే.

భారత్‌లోనే సర్వర్‌ ఏర్పాటు చేస్తాం..!
ప్రస్తుతం భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారిన కెనడా మొబైల్ సంస్థ బ్లాక్‌బెర్రీ సమస్యను దృష్టిలో ఉంచుకొని నోకియా తమ సర్వర్‌ను భారత్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషంయలో నోకియా తీసుకున్న నిర్ణయం బ్లాక్‌బెర్రీపై ఒత్తిడిని మరింత పెంచే అవకాశం ఉంది. అయితే బ్లాక్‌బెర్రీ సేవలను ప్రభుత్వం పర్యవేక్షించడానికి బ్లాక్‌బెర్రీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.