ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » మూడేళ్ల తర్వాత గరిష్ట స్థాయికి జీడీపీ వృద్ధి రేటు! (Indian economy | gross domestic rate | GDP Rate | fiscal | quarter)
మూడేళ్ల తర్వాత గరిష్ట స్థాయికి జీడీపీ వృద్ధి రేటు!
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థికాభివృద్ధి రేటు 8.8 శాతానికి పెరిగింది. గడచిన మూడేళ్లలో జీడీపీ ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో మంచి అభివృద్ధి సాధించటం వల్ల జీడీపీ ఈ సంఖ్యలో నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో ఈ జీడీపీ రెటు 8.6శాతంగా ఉంది.
దేశం ఆర్థిక మాంద్యం నుంచి కోలుకుంటుదనడానికి ఇదే నిదర్శనం. గత 2007 డిసెంబర్ తర్వాత జీడీపీ వృద్ధి రేటు ఈ స్థాయిలో పెరగటం ఇదే ప్రథమం. గనులు 8.9శాతం, విద్యుత్ రంగం 6.6శాతం, వ్యవసాయం 2.8శాతం, నిర్మాణ రంగం 7.5శాతం, వర్తకం, రవాణ 12.2శాతం వృద్ధి రేట్లను నమోదు చేశాయి.
మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి గానూ దేశ ఆర్థికాభివృద్ధి 7.4శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రాజెక్టులు 8.5శాతానికి పైగా పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ రేటు ఆరు శాతానికి పెరిగింది.