మహీంద్రా సత్యం, టెక్ మహీంద్రా కంపెనీలు ఇంకా అధికారికంగా విలీనం కాకముందే కలిసి పనిచేసేందుకు ప్రయత్నాలు మొదలెడుతున్నాయి. "వివిధ ప్రాజెక్టులను అమలు చేయడానికి మరియు మార్కెటింగ్ చేయడానికి మేము కలిసి పనిచేయనున్నాం. చాలా వరకు టెలికాం ప్రాజెక్టులను టెక్ మహీంద్రా వైపు మళ్లించాం. ఎందుకంటే ఇది ఈ విభాగంలో నైపుణ్యం కలిగి ఉంది" అని ఇరు కంపెనీలకు చెందిన వర్గాలు తెలిపాయి.
ఇటీవలే టెలికాం దిగ్గజం, ప్రభుత్వరంగ టెలికాం సంస్థ ఎమ్‌టీఎన్ఎల్ నుంచి మహీంద్రా సత్యంతో కూడిన కన్సార్టియంకు బిల్లింగ్ సొల్యూషన్ ప్రాజెక్టును అప్పగించింది. ఈ కన్సార్టియంలో ఐబీఎమ్, బీఈఎల్‌లు కూడా ఉన్నాయి. అయితే రెండు కంపెనీలకు పేరు వేరైనా చేసే పనులు మాత్రం దాదాపు ఒక్కటే. కొత్త నియామకాల సమయంలో కూడా ప్రస్తుతం ఉన్న వనరులను ఉపయోగించుకుంటున్నాయి.