ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » జీవిత భీమా సంస్థ నుంచి వెయ్యి కోట్ల పెట్టుబడులు! (LIC, Invest | Mohali Complex | Insurance major | real estate projects)
భీమా దిగ్గజం భారత జీవిత భీమా సంస్థ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) మొహాలీలో నిర్మించనున్న ఓ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కోసం రూ. 1,000 కోట్లను పెట్టుబడిగా వెచ్చించనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో ఈ బిల్డింగ్ పూర్తికానున్నట్లు ఎల్ఐసీకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
9.6 ఎకరాల విస్తీర్ణంలో ఆరు లక్షల చదరపు అడుగులతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, ఇందులో మూడు లక్షల చదరపు అడుగులను షాపింగ్ మాల్స్‌కు, మరో మూడుల లక్షల చదరపు అడుగులను కార్యాలయ భవంతులుగా కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికే ఎల్ఐసీ ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అభివృద్ధి పరుస్తుంది. అంతే కాకుండా కోలకతాలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో మరో షాపింగ్‌మాల్‌ను కూడా అభివృద్ధి పరిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2008లో ఎల్ఐసీ లుథియానాలో రూ. 228కోట్లతో 3.6ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.