సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » "నానో పార్ట్ - 2"ను ప్రారంభించిన టాటా మోటార్స్ (Tata Motors | Deluxe Nano | Nano Europa | European Markets | Nano)
Bookmark and Share Feedback Print
 
File
FILE
ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు కారును అందించి చరిత్ర సృష్టించిన సంస్థ టాటా మోటార్స్ తాము ప్రవేశపెట్టిన నానో మోడల్‌లో అడ్వాన్స్‌డ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది. 2012 నాటికి ఇది భారతదేశపు రోడ్లపై సంచరించనుంది. ఇది పవర్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సేప్టీ ఫీచర్స్‌తో వినియోగదారుల ముందుకు రానుంది.

ఇందులో ప్రత్యేకతలేంటంటే.. ప్రస్తుతం ఉన్న నానో కన్నా పొడవైన వీల్‌బేస్, అందమైన ఇంటీరియర్, శక్తివంతమైన 3-స్పోర్టీ ఆల్-అల్యూమినియం ఎమ్‌పీఎఫ్ఐ ఇంజన్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషీన్‌తో పాటు ఇంధన సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. ఇది పెట్రోల్ వేరియంట్.

అంతే కాదు.. దీని ద్వారా వెలువడే కర్బన వ్యర్ధాలు కూడా చాలా తక్కువ(కిలో మీటరకు 100 గ్రాముల కన్నా తక్కువ). ఇన్ని సదుపాయాలతో రూపొందించిన ఈ కారుకు "టాటా యూరోపా" అని నామకరణం చేశారు. తొలుత దీనిని యూరప్ మార్కెట్‌లో విడుదల చేసిన అనంతరం భారత మార్కెట్‌లో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.