ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఎల్ అండ్ టీ చేతికి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు! (Hyderabad Metro Rail Project | Larsen and Toubro Limited | Agreement | L&T)
ఎల్ అండ్ టీ చేతికి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు!
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు ప్రాజెక్టు ఎట్టకేలకు కార్యరూపందాల్చింది. ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకున్న ఎల్ అండ్ టి (లార్సెన్ అండ్ టూబ్రో) సంస్థతో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సమక్షంలో శనివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి టి.ఎస్.అప్పారావు, ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.బి.గాడ్గిల్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే సుమారు 269 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం డిసెంబర్‌లోగా ఎల్ అండ్‌టికి స్వాధీనం చేయాల్సి ఉంది. స్థలం స్వాధీనం చేసిన తర్వాత జనవరిలో మూడు రూట్లలో 71.6 కిలో మీటర్ల దూరంలో రూ.12,132కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు పనులు లాంఛనంగా ప్రారంభిస్తారు.