సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » సెప్టెంబర్ 7న సార్వత్రిక సమ్మె: కార్మిక సంఘాలు! (Strike | Worker | Bengal | Kolkata | Bandh)
Bookmark and Share Feedback Print
 
ఈ నెల 7 నుంచి బెంగాల్‌ రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జరపటానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను పూర్తిగా విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్మికలోకం సమాయత్తమవుతోంది. ఈ సమ్మెకు రాజకీయ అనుబంధాలకతీతంగా ఉద్యోగ, కార్మిక వర్గాలు సంఘీభావం ప్రకటించాయి.

ఉద్యోగ, కార్మిక వర్గాలతో పాటు రైతాంగాన్ని కూడా తీవ్ర ఇబ్బందుల పాలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మికలోకం ఈ సమ్మెను చేపట్టనుంది. రాష్ట్రంలో రవాణా రంగం మొదలు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తదితర అన్ని రకాల ఉద్యోగులు ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. విదేశాల్లోని కార్మిక సంఘాల నుంచి సైతం ఈ సమ్మెకు మద్దతు లభించటం విశేషం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.