సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 5.2శాతానికి పడిపోయిన ప్రపంచ కాఫీ ఎగుమతులు (World coffee exports | slump | coffee crop year | International Coffee Organisation)
Bookmark and Share Feedback Print
 
ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఎగుమతులు 5.2శాతానికి పడిపోయి 78.45 మిలియన్ బ్యాగులకు చేరుకున్నాయి. 2009-10 పంట సంవత్సరంలో తొలి పది నెలలకు గానూ ఈ తగ్గుదల సంభవించినట్లు బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ కాఫీ విభాగం తెలిపింది. కాగా.. భారత్, ఇండోనేషియాలలో మాత్రం కాఫీ ఎగుమతులు పెరిగాయి.

గత పంట సంవత్సరం ఇదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఎగుమతులు 82.73 మిలియన్ బ్యాగులు(ఒక్కో బ్యాకు 60 కేజీలు)గా ఉంది. అక్టోబర్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కాఫీ పంట సంవత్సరం నుడుస్తుంది. "2009-10 కాఫీ సంవత్సరంలో మొదటి పది నెలల్లో కాఫీ ఎగుమతులు 5.2శాతానికి తగ్గి 78.45 మిలియన్ బ్యాగులకు చేరుకుంది" అని అంతర్జాతీయ కాఫీ సంస్థ(ఐసీఓ) తెలిపింది.

కాఫీ ఎగుమతులకు ముఖ్య దేశాలైన బ్రెజిల్, వియత్నాం, కొలమబియా దేశాలలో కాఫీ అమ్మకాలు తగ్గడం కారణంగా ఎగుమతులు తగ్గినట్లు ఐఓసీ తెలిపింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కాఫీ ఎగుమతులు చేసే వియత్నాం కూడా ప్రస్తుతం పంట సంవత్సరంలో జులై వరకూ గరిష్ఠంగా 17.3శాతానికి పడిపోయి 12.81 మిలియన్ బ్యాగులకు చేరుకుంది. కాగా గత ఏడాది ఇదే సమయానికి 15.49 మిలియన్ బ్యాగులుగా ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.