ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఈ ఆర్థిక సంవత్సరం 50% వృద్ధి లక్ష్యం: ఎల్ అండ్ టీ (L&T Infrastructure | Fiscal | financial year | Suneet K Maheshwari)
ప్రముఖ మౌలికసదుపాయాల సంస్థ ఎల్ అండ్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కో లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం భారీ వృద్ధిని ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ. 4,500 కోట్లు సాధించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 50శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నట్లు ఎల్ అండ్ టీ ఇన్ఫ్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీత్ కె మహేశ్వరి తెలిపారు.
శనివారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టను జనవరిలో మూడు రూట్లలో 71.6 కిలో మీటర్ల దూరంలో రూ.12,132కోట్ల అంచనా వ్యయంతో పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు.
మెట్రో రైలు పనులను దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ రూ.1458కోట్లు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (బిజిఎప్) కోరింది. మిగిలిన వ్యయాన్ని ఎల్ అండ్ టి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు రూ.360కోట్లు ఫైనాన్సియల్ క్లోజర్స్ ముందస్తుగా బయానా ఎల్ అండ్ టి ఆరు మాసాల్లోగా బ్యాంగ్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది.