ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » అక్టోబర్ 7 నుంచి స్పైస్‌జెట్ అంతర్జాతీయ సర్వీసులు (SpiceJet | Announce | International Destinations | Kathmandu | First Flight)
గత ఐదేళ్లుగా చౌక ధరలకే విమాన సేవలు అందిస్తున్న స్వదేశీ విమానయన సంస్థ స్పైస్‌జెట్ త్వరలో విదేశీ మార్కెట్‌లో అడుగు పెట్టనుంది. అక్టోబర్ 7 నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రాంరభించను్న్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. గడచిన ఐదేళ్లుగా వాటాదారులు మా మీ ఉంచిన నమ్మకం, వారి ప్రోత్సాహం కారణంగానే మేము ఈ విజయాన్ని సాధించగలిగాం అని సంస్థ డైరంక్టర్, సీఈఓ కిషోర్ గుప్తా తెలిపారు.
ఇందులో భాగంగా ముందుగా న్యూ ఢిల్లీ నుంచి కాఠ్మండూకి, తర్వాత న్యూ ఢిల్లీ నుంచి కొలంబోకు అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 9 నుంచి చెన్నై - కొలంబో రూట్‌లో డైలీ ఫ్లైట్, అలాగే కాఠ్మండూ రూట్‌లో వారంలో ఆరు రోజుల పాటు విమాన సర్వీసులు అందించనుంది. కాఠ్మండూ, కొలంబోకు ఇప్పటి నుంచే బుకింగ్‌లు ప్రాంరభించామని సంస్థ సీఈఓ సంయుక్త్ శ్రీధరన్ తెలిపారు.