సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 9,365 టన్నుల పప్పుధాన్యాల అమ్మకం: ఎమ్‌ఎమ్‌టీసీ (MMTC | Invited Bids | Imported Pulses | red lentils | black mapte)
Bookmark and Share Feedback Print
 
ప్రభుత్వరంగ సంస్థ ఎమ్‌ఎమ్‌టీసీ దిగుమతి చేసుకున్న 9,365 టన్నుల పప్పుధాన్యాలను స్థానిక మార్కెట్లో అమ్మకానికై ఈ నెల చివరి నాటికి బిడ్‌లను ఆహ్వానించింది. ఈ బిడ్డింగు సెప్టెంబర్ 14న ముగుస్తుంది. ఈ బిడ్డింగు ఫలితాలపై నిర్ణయం సెప్టెంబర్ 21న తీసుకోనున్నట్లు ప్రకటించింది.

దిగుమతి చేసుకున్న 9,365 టన్నులలో 3,800 టన్నుల కందిపప్పు, 2,750 టన్నుల ఎర్ర పెసలపప్పు, 2,565 టన్నుల పచ్చ మినప్పప్పు, 250 టన్నుల మినప్పప్పు(నలుపు రకం)ను ఈ నెలలో విక్రయించనుంది. కాగా.. ఈ పప్పుధాన్యాలు 2009-10 పంటకాలంలో పండినవి. వీటిని మయన్మార్‌, కెనడా, టాంజానియా, ఆస్ట్రేలియా, మాల్విల నుంచి దిగుమతి చేసుకున్నవి.

దిగుమతి చేసుకున్న పప్పుధాన్యాలను ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని గోడౌన్లలో భద్రపరుస్తారు. బిడ్‌లో పాల్గొనే వారు కనీసం 250 టన్నులకు బిడ్‌వేయవలసి ఉంటుంది. దేశంలో ఏర్పడిన 3-4 మిలియన్ టన్నుల లోటును భర్తీ చేయడానికి గానూ ఎమ్‌ఎమ్‌టిసి మరియు కొన్ని పబ్లిక్ ట్రేడింగ్ సంస్థలు ప్రభుత్వం తరపున ఈ పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.