ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఆగస్టు నెల అమ్మకాలలో రెండింతల వృద్ధిని సాధించింది. ఆగస్టు నెలలో మొత్తం అమ్మకాలు 573 యూనిట్లకు చేరుకున్నాయి. కాగా.. గతేడాది ఇదే సమయానికి సంస్థ కేవలం 270 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.
కాగా.. కంపెనీ జనవరి - ఆగస్టు విక్రయాలలో 84.15శాతం వృద్ధిని సాధించి 3,497 యూనిట్లను నమోదు చేసుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయానికి 1,899 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సంస్థ లగ్జరీ కార్లయిన సీ-క్లాస్, ఈ-క్లాస్, ఎస్-క్లాస్ సెడాన్, ఎమ్-క్లాస్, జీఎల్ స్పోర్ట్స్ వంటి మోడళ్లను విక్రయిస్తుంది.