సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » పెట్రోల్ ధరల పెంపునకు అడ్డు చెప్పలేం : మన్మోహన్ (Petrol Price | Manmohan Singh | Investments | Business)
పెట్రోల్ ధరల పెంపునకు తాము అడ్డు చెప్పలేమని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెట్రోల్ ధరల పెంపుని అడ్డుకోలేమన్నారు.

అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడులను దేశం సమర్థవంతంగా అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చమురు సంబంధ ఉత్పత్తులపై సబ్సిడీలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఏకీకరణ ప్రక్రియను ప్రారంభించాలన్నారు.

కొత్త పెట్టుబడులను విస్తరించుకోవడం, శక్తి రంగంలో సామర్థ్యాన్ని సాధించడంలో కృషి చేయాలని, ప్రపంచ ధరలతో భారతదేశ శక్తి రంగంలో ధరలు సర్దుబాటు చేయడంతోపాటు మరింత హేతుబద్ధ ధరలు సాధించాలని ఆయన సూచించారు.
WebduniaWebdunia