ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 2వ తేదీ నుంచి లీటరు పెట్రోల్‌పై రూ.రెండు వడ్డన! (Currency | Petrol Price | Crude oil Price | Dollar)
2వ తేదీ నుంచి లీటరు పెట్రోల్‌పై రూ.రెండు వడ్డన!
కొత్త సంవత్సర కానుకగా దేశంలో పెట్రోల్ ధరలు మరోమారు పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో స్వదేశీయంగా చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇందులోభాగంగా సోమవారం అర్థరాత్రి నుంచి లీటరు పెట్రోల్‌పై రెండు రూపాయలు చొప్పున పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఈ ధరల పెంపు అంశంపై శనివారం జరగాల్సిన సమీక్షా సమావేశాన్ని ఆయిల్ కంపెనీలు సోమవారానికి వాయిదా వేశాయి. ప్రస్తుతం భారత కరెన్సీ విలువ క్షీణించడంతో చమురు దిగుమతులపై వ్యయం పెరిగి ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీలు వివరణ ఇస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పెట్రోల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.