సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » నాలుగో వారంలోనూ మైనస్‌లోనే ఆహార ద్రవ్యోల్బణం!! (Inflation | Onions | rbi | Vegetables | Business)
File
FILE
వరుసగా నాలుగో వారంలోనూ ఆహార ద్రవ్యోల్బణం ప్రతికూలంలోనే కొనసాగింది. జనవరి 14వ తేదీతో ముగిసిన వారానికి మైనస్ 1.03 శాతంగా నమోదైంది. కాగా మార్చిలో రానున్న మధ్యంతర త్రైమాసిక సమీక్షలో భారతీయ రిజర్వు బ్యాంకు కీలక రేట్లలో కోత విధిస్తే ఈ ద్రవ్యోల్బణం దారికి వస్తుందన్న నమ్మకాన్ని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గత సంవత్సరం ఇదే వారంలో ఆహార ద్రవ్యోలబణం 17 శాతంగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఇది మైనస్ 0.41 శాతంగా నమోదైంది. కాగా కూరగాయల ధరలు 47.06 శాతం తగ్గగా ఉల్లి ధరలు 79.10 శాతం, గోధుమ ధర 3.37 శాతం మేర తగ్గాయి. డిసెంబరు నెలలో ఆహార ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ట స్థాయి 7.47 శాతానికి చేరింది.

ఇదిలావుండగా, ఆహార ద్రవ్యోల్బణం గణాంకాలను వారం వారం విడుదల చేయడాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేసమయంలో నెలవారీ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేయడం కొనసాగిస్తామని వాణిజ్య శాఖ స్పష్టం చేసింది.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia