ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » యూరో సంక్షోభం : బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు!! (Euro Economic Crisis | Gold Rates | International Market | India)
యూరో సంక్షోభం : బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు!!
శనివారం, 28 జనవరి 2012( 12:14 IST )
అంతర్జాతీయ బంగార మార్కెట్‌ను యూరోపియన్ యూనియన్ ఆర్థిక సంక్షోభం తీవ్ర ఒడిదుడుకులకు లోను చేస్తోంది. ఫలితంగా స్వదేశీ మార్కెట్‌లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల క్రితం ఒక తులం బంగారం ధర రూ.20,568గా ఉంది. ఇది గురువారానికి రూ.712గా పెరిగి రూ.21,280కు చేరుకుంది.
ఈ పరిస్థితుల్లో శుక్రవారం కూడా బంగారు ధరలలో మార్పులు కనిపించింది. అయితే శుక్రవారం ఒక తులం బంగారం రూ.21,016గా ఉంది. దీని కారణంగా ఒకే రోజులో తులానికి 264 రూపాయలు తగ్గింది. ఇంకా ఒక గ్రాము బంగారం ధర రూ.2,627గా పలికింది.
యురోపియన్ యూనియన్ ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారం ధరల్లో నిలకడలేమి కనిపిస్తున్నట్టు బంగారం వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం కారణంగా మున్ముందు నెలల్లో కూడా హెచ్చు, తగ్గులు కనిపించే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.