సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » 2012-13 వార్షిక బడ్జెట్‌లో ఉద్యోగస్తులకు శుభవార్త!! (Pranab Mukherjee | Union Budget 2012-13 | Income tax Slab | tax Exemption)
pranab
File
FILE
2012-13 వార్షిక బడ్జెట్‌లో దేశంలోని ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించనుంది. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని రెండు లక్షల రూపాయలకు పెంచే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సూచన ప్రాయంగా వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను వచ్చే మార్చి నెలలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న కథనాల మేరకు.. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచేందుకు మంత్రి ప్రణబ్ సమ్మతించినట్టు పేర్కొంటున్నాయి. అలాగే, టాక్స్ శ్లాబ్‌ విధానాన్ని కూడా మార్చనున్నట్టు సమాచారం. ఈ టాక్స్ శ్లాబ్స్‌ను నేరుగా డైరక్ట్ టాక్స్ కోడ్ బిల్లు పరిధిలోకి చేర్చాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ బిల్లును 2010లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది.

ఈ ప్రతిపాదిత బిల్లులో 2 నుంచి 5 లక్షల రూపాయల ఆదాయం కలిగిన వారు పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 5 నుంచి 10 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు 20 శాతం పన్ను, పది లక్షల రూపాయలకు పైబడి ఆదాయం ఉన్న వారు 30 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న టాక్స్ విధానం ప్రకారం రూ.1.8 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారి నుంచి పది శాతం పన్నును వసూలు చేస్తున్నారు. అలాగే, 5 నుంచి 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు 20 శాతం, ఎనిమిది లక్షల రూపాయలకు పైగా ఆదాయం కలిగిన వారి నుంచి 30 శాతం పన్నును వసూలు చేస్తున్నారు.
WebduniaWebdunia