సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ఒక టన్ను స్టీల్‌పై రూ.3వేలు పెంచిన సెయిల్! (Sail Company | Steel Rates | Business)
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉక్కు ధరలను పెంచింది. నిర్మాణ రంగంలో ఊపందుకుంటున్న నేపథ్యంలో ఒక టన్ను స్టీల్‌పై మూడువేల రూపాయలను రూపాయలను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పెంచింది. ఈ పెంచిన ధరలు ఫిబ్రవరి ఒకటో తేది నుంచి అమల్లోకి వచ్చిందని సెయిల్ సంస్థ పేర్కొంది. అయితే హాట్ రోల్స్, కోల్డ్ రోల్స్ కాయిల్స్‌ ధరలలో ఏ మార్పులేదు.

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్ మే 2011లోనే ధరలను పెంచింది. కంపెనీ ఉత్పత్తి చేసే టిఎమ్‌టి బార్స్‌పై రూ.2,500 నుంచి రూ.4,000 వరకు పెంచింది. దీంతో టన్ను స్టీల్ ధర 37,500 రూపాయలకు చేరుకుంది.

ఇంతకుమునుపు టన్ను స్టీల్ ధర 35,000 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో స్టీల్ వాడకంలో కేవలం నాలుగు శాతం వృద్ధి మాత్రమే చోటు చేసుకుంది.
WebduniaWebdunia