ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » యూరో సంక్షోభ నివారణకు బ్రిక్స్ ఉద్దీపన ప్యాకేజీ! (Euro Zone | Brics Summit | imf Fund | China | India)
యూరో సంక్షోభ నివారణకు బ్రిక్స్ ఉద్దీపన ప్యాకేజీ!
బుధవారం, 20 జూన్ 2012( 10:59 IST )
రుణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న 17 ప్రపంచ దేశాల కూటమి యూరో జోన్‌కు బ్రిక్స్ దేశాల కూటమి 75 మిలియన్ డాలర్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. యూరో జోన్‌కు ఇప్పటికే... అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐంఎఫ్) ప్రకటించిన 430 బిలియన్ డాలర్ల ఉద్దీపన నిధులను కేటాయించింది. తాజాగా బ్రిక్స్ దేశాలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి. ఇందులో భారత్ వాటా 10 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ బ్రిక్స్ దేశాల కూటమిలో భారత్‌తో పాటు చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి. మెక్సికోలోని లాస్‌కాబోస్‌లో ఏడో జి-20 సదస్సు ప్రారంభంకావడానికి ముందు బ్రిక్స్ ఉద్దీపన ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనా 43 బిలియన్ డాలర్లు, రష్యా 10 బిలియన్ డాలర్లు, బ్రెజిల్ 10 బిలియన్ డాలర్లు, దక్షిణాఫ్రికా 2 బిలియన్ డాలర్లు తమ వంతు ఉద్దీపన నిధిగా ప్రకటించాయి.