ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » వార్తలు » ధరల పెంపు బాధాకరం.. అయినా బాదుడు తప్పదు : జైపాల్ రెడ్డి (Fuel Price Hike | Diesel Price | lpg | Kerosene | S.Jaipal Reddy)
ధరల పెంపు బాధాకరం.. అయినా బాదుడు తప్పదు : జైపాల్ రెడ్డి
మంగళవారం, 11 సెప్టెంబర్ 2012( 16:06 IST )
File
FILE
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు బాధాకరమైనప్పటికీ ప్రజలపై బాదుడు తప్పదని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి ఎస్.జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్ ధరల పెంపు అనివార్యమన్నారు. అయితే, రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ (సీసీపీఏ) ఈ అంశంపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
మంగళవారం సాయంత్రం సీసీపీఏ భేటీ జరుగనుందన్నారు. ఈ సమావేశంలో డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు అంశం లేదనీ, ఒక వేళ భేటీ సమయానికి ఈ అంశం చేర్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఈ విషయంపై తాను స్పష్టంగా ఏ విషయం చెప్పలేనన్నారు.
పెట్రోల్ ధరల పెంపు చాలా బాధాకరం, అత్యంత క్లిష్టతరమని తాను మంత్రివర్గానికి ఇప్పటికే చెప్పానని, అయినప్పటికీ.. వీటి ధరల పెంపు అనివార్యమన్నారు. తన వరకు ఒక మంత్రిగా తన విధులను నిర్వహిస్తున్నట్టు మంత్రి జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందువల్ల పెట్రోల్ ధరలు ఇవాళ లేదా మరో వారం రోజుల్లో పెరగవచ్చని మంత్రి జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
దేశంలోని చమురు కంపెనీలు డీజిల్, వంట గ్యాస్ ఇంధనం విక్రయాల ద్వారా రోజుకు 560 కోట్ల రూపాయలు, పెట్రోల్ పై రూ.16 కోట్లు నష్టపోతున్నాయి. అంతేకాకుండా, దేశీయ చమురు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.88 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినట్టు ప్రకటించాయి. మరోవైపు లీటరు డీజిల్ విక్రయంపై రూ.19.26, లీటర్ కిరోసిన్‌పై రూ.34.34, 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.347 చొప్పున నష్టపోతున్నాయి.