రూపాయి పతనం - బంగారం రికార్డు : డోంట్ వర్రీ .. చిదంబరం

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:34 IST)

Widgets Magazine

File
FILE
రూపాయి పతనం రోజురోజుకూ మరింతగా దిగజారిపోతోంది. సోమవారం 104 పైసలు కోల్పోయిన రూపాయి మంగళవారం ఉదయం మరో 100 పైసల దాకా నష్టపోయి దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 65.30 పైసలకు చేరింది. ఇది డాలర్‌తో పోలిస్తే రూపాయి మళ్లీ రూ.65.30 పైసలుగా పలుకుతోంది. రిజర్వ్‌ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి.

మరోవైపు.. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం తాపీగా సమాధానం ఇస్తున్నారు. దేశీయ కారణాల వల్లే రూపాయి విలువ పతనమైందంటూ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. మే 22వ తేదీ నుంచి రూపాయిపై ఒత్తిడి తీవ్రంగా ఉందని, పెట్టుబడులు ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, రూపాయి విలువ కూడా సరైన స్థాయికి చేరుకుంటుందని చెప్పారు.

మరోవైపు.. జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకం పెరగడంతో బంగారం ధర 31 వేలకు చేరగా, గత కొన్ని రోజుల నుంచి రూపాయి పతనంతో ధరలు మరింత తార స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం ఒక్క రోజే స్పాట్ మార్కెట్‌లో రూ.600 పెరిగి 10 గ్రాముల బంగారం ధర 32,512 పలికింది. అటు కిలో వెండి కూడా రూ.700 పెరిగింది.

ఇకపోతే.. రూపాయి పతనంతో స్టాక్‌ మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా పడుతూ 18,350కి సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్ల దాకా కోల్పోతూ 5,410కి సమీపంలో కొనసాగుతోంది. రూపాయి పతనం ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

బిజినెస్

పదవికి మాంటెక్ సింగ్ అహ్లువాలియా రాజీనామా!

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ...

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ ...

స్వదేశీ మార్కెట్‌లో నేటి విదేశీ కరెన్సీ రేట్లు

విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) ...

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో ఆదివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

హైదరాబాద్‌లో రేవ్ పార్టీల కల్చర్: ఎన్నిసార్లు దాడిచేసినా నో యూజ్!

హైదరాబాద్‌లో రేవ్ పార్టీల కల్చర్ సాగుతోంది. ఎన్నిసార్లు పోలీసులు దాడులు చేస్తున్నా, ఈ సంస్కృతి ...

రాహుల్ గాంధీ శకం ఆరంభానికి ముందే అంతరించినట్టేనా?

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు ...

లేటెస్ట్

అయ్యబాబోయ్.. పాన్‌వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు!!

అయ్యబాబోయ్.. పాన్‌వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు!! అవునండి. నిజమే. హర్యానాకు చెందిన ఓ ...

కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీట్: Nov 5నుంచి బడ్జెట్ సమావేశాలు!

కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా.. నవంబర్ 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ...

Widgets Magazine
Widgets Magazine