ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
 
హ్యాండ్ సెట్లలో ఎయిర్‌టెల్ జీపీఎస్ నావిగేషన్
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ హ్యాండ్ సెట్లకు జీపీఎస్ నావిగేషన్ సేవలను ప్రారంభించింది. స్వీడన్ కేంద్రంగా పనిచేసే వేఫైండర్ సిస్టమ్స్ ఏబీ సంస్థతో ఎయిర్‌టెల్ సంస్థ చేతులు కలిపి జీపీఎస్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఎయిర్‌టెల్ బ్లాక్‌బెరీ 8800 యూజర్లు ఈ జీపీఎస్ నావిగేషన్ సేవలను ఆరు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.

ఇందుకోసం ఈ యూజర్లు 'NAV' అని ఇచ్చి 3636కు ఎస్ఎమ్ఎస్ చేయాలి. అయితే, బ్లాక్‌బెరీ పథకం ప్రకారం చందాదారులకు డౌన్‌లోడింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. ప్రస్తుతానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, నవీ ముంబై, ఢిల్లీ, కోల్‌కత, పూణే, థానే మరియు చండీగఢ్ ప్రాంతాల వివరాలు మరియు మ్యాప్ సమాచారాన్ని ఎయిర్‌టెల్ యూజర్లు పొందగలరు.
మరిన్ని
గడచిన త్రైమాసికంలో భారీగా ఇన్ఫోసిస్ ఆదాయం
జీటీఎల్ ఐటీ వ్యాపారం ఆరంజ్ సొంతం
తమిళనాడులో హెచ్‌సీఎల్ ఆఫ్‌షోర్ కేంద్రం
ఐటీలో అభివృద్ధి దిశగా పశ్చిమ బెంగాల్‌: దేబేష్
చెన్నైలో సన్‌ మైక్రోసిస్టమ్స్ ట్రైనింగ్‌ సెంటర్
యూనియన్లు అవసరం లేదు: గోపాలకృష్ణన్