ప్రముఖ ఆర్ఎఫ్ ఉత్పత్తుల సంస్థ కావేరీ టెలికాం ఈ ఏడాది చివరిలోగా రూ.100 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసుకోనుంది. వైర్‌లెస్ ఇండస్ట్రీగా పేరుగాంచిన ఈ సంస్థ వడాఫోన్, టాటా టెలీ సర్వీసెస్ నుంచి ఇప్పటికే కాంట్రాక్టులను కైవసం చేసుకుందని కావేరీ టెలికాం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
వీటితో పాటు స్పైస్ టెలికాం నుంచి ఏంటనా ఆధారిత స్టేషన్లను సరఫరా చేసే ఆర్డర్లను సొంతం చేసుకుంది. కర్ణాటక, పంజాబ్ ప్రాంతాల్లో ఏంటనా ఆధారిత కాంట్రాక్టులను కైవసం చేసుకున్న కావేరీ టెలికాం ఏడాదిలోగా రెడింతలు టర్నోవర్‌ను నమోదు చేసుకునే అవకాశముందని ఆ ప్రకటన వివరాలు తెలిపాయి.
ప్రస్తుతం కావేరీ 15వేల ఏంటనా ఆధారిత స్టేషన్లను నిర్వహిస్తోంది. ఈ ఏంటనా స్టేషన్ల సంఖ్య వచ్చే మూడేళ్లలో 25వేలకు పెరగవచ్చునని సంస్థ ఉన్నతాధికారిక వర్గాలు తెలిపాయి. కావేరీ టెలికాం ప్రస్తుతం బెంగళూరు, జిగానీ ప్రాంతాల్లో ఉత్పత్తి కేంద్రాలను కలిగిఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.
|