ప్రముఖ ఐటీ సంస్థ యూరప్‌తో పాటు యూరప్‌కు చెందిన దేశాల్లో తమ సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐటీ సేవలను యూరప్‌లో ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్ సన్నాహాలు జరుపుతోందని సాఫ్ట్‌వేర్ ఛీఫ్ మెంటర్ ఎన్నార్ నారాయణ మూర్తి చెప్పారు.
యూరప్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ ఐటీ ఉత్పత్తుల ఎగుమతిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం యూరప్‌దేశంలో ఇన్ఫోసిస్ 27 శాతం రెవిన్యూను కలిగి ఉందని ఆయన చెప్పారు. అంతేకాకుండా యూఎస్ మార్కెట్లో ఇన్ఫోసిస్ ఉత్పత్తుల విక్రయింపును కూడా విస్తరించనున్నామని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని, టెక్నాలజీ వినియోగాన్ని మెరుగుపరుచుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
|