ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
 
పునర్వ్యవస్థీకరణ దిశగా ఇన్ఫోసిస్
అంతర్జాతీయ ఐటీ రంగంలో పోటీదారులకు గట్టి పోటీని ఇచ్చేందుకు ఇన్ఫోసిస్ సంస్థ తన వ్యాపార యూనిట్ల పునర్వ్యవస్థీకరణ‌ను ప్రారంభించింది. సంబంధిత కార్యాచరణ ప్రణాళిక నవంబరు మాసం నుంచి అమలులోకి వస్తుంది.

ఇన్ఫోసిస్ బిజినెస్ యూనిట్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా మరో 11 పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఖాతాదారులకు అందించే సేవల తాలూకు పరిధి విస్తరణ, పలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ప్రాధాన్యతను దృఢపరుచుకునేందుకు పునర్వ్యవస్థీకరణ ఉపకరిస్తుందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇక విదేశీ కార్యకలాపాలపై పూర్తి స్థాయి దృష్టిని కేంద్రీకరించాలని ఇన్ఫోసిస్ వర్గాలు భావిస్తున్నాయి. తన వ్యాపార విస్తరణలో భాగంగా దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, గల్ఫ్, కెనడా, చైనా మరియు లాటిన్ అమెరికా దేశాల్లో ఇన్ఫోసిస్ ఇప్పటికే న్యూ గ్రోత్ ఇంజిన్స్ (ఎన్‌జిఇ) యూనిట్‌ను ప్రారంభించింది.
మరిన్ని
ఇకపై ఎన్ఐఐటీ, అబోడ్ ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లు
దక్షిణాఫ్రికాలో సేవలను ప్రారంభించిన టీసీఎస్
ఎన్ఐఐటీ Q2 ఫలితాల విడుదల
"ఇనోవేషన్ ఇస్లే"ను ఆవిష్కరించిన విప్రో
సైబర్ నేరాలపై భారతీయుల నిర్లిప్తత
బీఎస్ఎం వాణిజ్యాన్ని ఆవిష్కరించనున్న హెచ్‌పీ