ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వొడాఫోన్ వారి దీపావళి బొనాన్జా
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ దీపావళి పండుగ సందర్భంగా కొత్త ప్రత్యేక ఫెస్టివ్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా వొడాఫోన్ కనెక్షన్లను పొందే వారికి రూ. 20 కోట్ల వరకు ప్రత్యేక బహుమతులను అందజేయనుంది. ఈ నెల 30వ తేదీ వరకు వొడాఫోన్ కనెక్షన్లను పొందే వారికి ఈ ప్రత్యేక ఆఫర్ లభిస్తుందని కంపెనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ నెల 30 తేదీలోగా కొత్తగా ప్రీపెయిడ్ వినియోగదారులకు రాత్రిపూటల్లో ఉచిత కాల్స్, ఉచిత, డిస్కౌట్ లోకల్ కాల్స్‌ను పొందే అవకాశముంది. వీటితో పాటు ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా పొందవచ్చును.

రూ. 351 రీ ఛార్జ్ చేసిన వారికి పూర్తి టాక్‌ టైంను, రూ.999కి రీఛార్జ్ చేసే వారికి రూ. 555 టాక్‌టైంను ప్రీపెయిడ్ వినియోగదారులు పొందవచ్చును. అదే విధంగా పోస్ట్ పెయిడ్ వినియోగదారులు బిల్ పేమెంట్‌ నిర్ణీత కాలంలో చెల్లించిన వారికి ప్రత్యేక బహుమతులతో పాటు ప్రమోషనల్ ప్యాక్‌లను సొంతం చేసుకోవచ్చునని వొడాఫోన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కేరళ) కె. శంకర నారాయణన్ చెప్పారు.
మరిన్ని
నాణ్యమైన సేవలందిస్తాం: బీఎస్ఎన్ఎల్
రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో బిగ్ టీవీ
ఇకపై టాటా కమ్యూనికేషన్స్‌గా వీఎస్ఎన్ఎల్
సిస్కోతో సత్యం కంప్యూటర్స్ ఒప్పందం
ఆర్‌కాం నికరలాభం రూ.801.24 కోట్లు
ఇండో-జర్మనీ టెక్నాలజీ ఒప్పందం