ప్రముఖ సెల్‌ఫోన్ ఉత్పత్తి సంస్థ నోకియా అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కొత్త హ్యాండ్‌సెట్లను ప్రవేశపెట్టింది. నోకియా ఎన్81, ఎన్95 8జీబీ అనే మోడల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ మోడళ్ల ధర రూ. 26,249 నుంచి రూ. 35, 059 వరకు ఉంటాయని కంపెనీ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
పలు వినోదాత్మక అంశాలను ఈ మోడల్స్ కలిగి ఉంటాయని నోకియా ఇండియా బిజినెస్ డైరక్టర్ (మల్టీమీడియా) వినీత్ తనేజ విలేకరులతో చెప్పారు. మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన ఈ రెండు మోడల్స్ ఫుల్ పూర్తిస్థాయి సినిమా చూడటానికి ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
ఇందులో ఎన్81 మోడల్‌తో పాటు 10 ఇంగ్లీష్ మ్యూజిక్ వీడియోస్, బాలీవుడ్, టాలీవుడ్ పాటలు, పది కామెడీ సన్నివేశాలను కూడా పొందవచ్చును. భవిష్యత్తులో ఎన్ 95 8 జీబీ మోడల్ 2.8 అంగుళం, ఫ్లాష్ మెమరీ, ప్లేయింగ్ గేమ్స్, వీడియో వంటి తదితర అదనపు సదుపాయాలను కలిగి ఉంటుందని తనేజ వివరించారు.
|