ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వచ్చే నెల 12న బీఎస్ఎన్ఎల్ జాతీయ స్థాయి సమ్మె
తమ డిమాండ్ల పరిష్కారం కోరుతు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఉద్యోగులు వచ్చేనెల 12వ తేదీన దేశ వ్యాప్తం సమ్మె చేపట్టనున్నారు. తమ ప్రమోషన్లు, అనోమ్లీ కమిటీ నివేదిక అమలు, అడ్-హాక్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడం తదితర డిమాండ్లతో ఈ సమ్మె చేపట్టనున్నట్టు బీఎస్ఎన్ఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీల్ యూనియన్స్ ప్రధాన కార్యదర్శి వీఏఎన్ నంబూద్రి వెల్లడించారు.

దీనిపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ఈ సమ్మెకు ముందుగా ఈనెల 21వ తేదీన నిరసన పాటించనున్నట్టు చెప్పారు. అయితే తమ డిమాండ్ల పరిష్కారం కోసం తాము ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అందువల్ల ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి, సమ్మె వల్ల కలిగే నష్టాన్ని నివారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరిన్ని
ఫినెటెక్ 100 జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్
అండమాన్‌లో బీఎస్ఎన్ఎల్ మొబైల్ స్విచ్ఛింగ్ సెంటర్
కొత్త హ్యాండ్‌సెట్లను ప్రవేశపెట్టిన నోకియా
వొడాఫోన్ వారి దీపావళి బొనాన్జా
నాణ్యమైన సేవలందిస్తాం: బీఎస్ఎన్ఎల్
రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో బిగ్ టీవీ