ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సన్ నెట్‌వర్క్‌కు ఆరకెల్ బిల్లింగ్ సొల్యూషన్లు
సన్ డైరక్ట్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు గ్లోబల్ సాఫ్ట్‌వేర్ మార్కెట్లో పేరొందిన ఆరకెల్ బిల్లింగ్ సొల్యూషన్లను అందించనుంది. ఈ బిల్లింగ్ సొల్యూషన్లతో సన్ నెట్‌వర్క్ డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) సేవలను తమ వినియోగదారులకు అందించనుందని సంస్థ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ సొల్యూషన్ల ఆధారంతో సన్ నెట్‌వర్క్ బిల్లింగ్ ప్రక్రియలతో పాటు... అత్యాధునిక సాంకేతిక విధానంతో కూడిన సేవలను వినియోగదారులకు అందిస్తుంది. సైమెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ (ఎస్ఐఎస్ఎల్)తో ఆరకెల్ సంయుక్తంగా నెట్‌వర్క్ ఆధారిత చర్యలు చేపట్టనుంది.

ఆరకెల్ సాంకేతిక విధానంతో అత్యంత వేగంగా తమ సేవలను వినియోగదారులకు అందించవచ్చునని సన్ డైరక్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ టోని ది సిల్వ విలేకరులతో చెప్పారు.
మరిన్ని
వచ్చే నెల 12న బీఎస్ఎన్ఎల్ జాతీయ స్థాయి సమ్మె
ఫినెటెక్ 100 జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్
అండమాన్‌లో బీఎస్ఎన్ఎల్ మొబైల్ స్విచ్ఛింగ్ సెంటర్
కొత్త హ్యాండ్‌సెట్లను ప్రవేశపెట్టిన నోకియా
వొడాఫోన్ వారి దీపావళి బొనాన్జా
నాణ్యమైన సేవలందిస్తాం: బీఎస్ఎన్ఎల్