ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రిటైల్ రంగానికి ఐబీఎం సొల్యూషన్స్
దేశంలోని రిటైల్ మార్కెటింగ్ దిగ్గజాలను దృష్టిలో ఉంచుకున్న అమెరికా ఆధారిత హార్డ్‌వేర్ దిగ్గజం ఐబీఎం, నిర్వహణా నైపుణ్యాలను పెంపొందించే పలు రకాల సేవలను అందించే బిజినెస్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్లను విడుదల చేసింది.

స్టోర్ ఇంటిగ్రేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎస్ఐఎఫ్)గా పిలవబడే ఈ సొల్యూషన్లు భారత రిటైర్లకు వర్తించే కీలక అంశాలైన సెక్యూరిటీ, ఛానెల్ ఇంటిగ్రేషన్ మరియు ఖాతాదారు మేనేజ్‌మెంట్‌కు సహకరించడం ద్వారా విక్రయాల పెంపుదల, నిర్వహణా సామర్ధ్యాల వృద్ధి, చోరీలను అదుపులో ఉంచడం ద్వారా నష్టాల తగ్గుదల మరియు ఖాతాదారులకు సంపూర్ణమైన సంతృప్తిని అందిస్తాయి.

ఐబీఎం డిజిటల్ వీడియో సర్వైలన్స్ (డీవీఎస్) సొల్యూషన్, ఐబీఎం ఎనీప్లేస్ కియోస్క్స్ సొల్యూషన్లు ఐటీని వినియోగించడంతో భారతీయ రిటైలర్లు పోటీ ప్రపంచంలో నిలబడటానికి ఉపకరిస్తాయి. రోజురోజుకు పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌లో తమ మనుగడ కోసం రిటైలర్లు ఐటీ సొల్యూషన్లను వినియోగించుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని ఐబీఎం సొల్యూషన్స్ డైరక్టర్ (భారత్ మరియు దక్షిణ ఆఫ్రికా) కేఎస్.రంగనాథన్ మీడియాతో అన్నారు.
మరిన్ని
ఐడీఎఫ్‌సీతో జీటీఎల్ ఒప్పందం
మోటరోలాతో అవగాహన కుదుర్చుకున్న అవయా గ్లోబల్
నంబర్ పోర్టబులిటీని స్వాగతించిన ఎంటీఎన్ఎల్
ఆపరేటర్లు నిబంధనలు పాటించాలి: ట్రాయ్
లిఫ్ట్‌లో ఈఎన్ఎన్ తాజా వార్తలు
ఎయిర్‌టెల్ ఇకపై ఎయిర్‌టెల్ మల్టీమీడియా