భారతదేశంలోని టెలికాం ఖాతాదారుల సంఖ్య అక్టోబర్ మాసాంతానికి 250 మిలియన్లకు చేరుకుంది. అక్టోబర్ మాసానికి కొత్తగా 7.89 మిలియన్ల మంది ప్రజలు కొత్త టెలికాం ఖాతాదారులుగా నమోదు అయ్యారని ఒక ప్రకటన పేర్కొంది. సెప్టంబర్ మాసంలో ఈ సంఖ్య 7.64 మిలియన్లుగా వెల్లడించింది.
2007 సంవత్సరాంతానికి నిర్దేశించబడిన 256.55 మిలియన్ల ఖాతాదారుల లక్ష్యాన్ని అక్టోబర్ మాసాంతానికి చేరుకోవడం గమనార్హం. పూర్తిస్థాయి టెలికాం సాంద్రత అక్టోబర్ మాసాంతానికి 22.52 శాతానికి చేరుకోగా, గడచిన సెప్టంబర్ మాసంలో సాంద్రత 21.85గా నమోదయ్యింది.
ఇక వైర్‌లెస్ విభాగాన్ని పరిశీలించినట్లయితే, సెప్టెంబర్ మాసాంతానికి అదనంగా 7.80 మిలియన్ల ఖాతాదారులు నమోదు కాగా, అక్టోబర్ మాసాంతానికి 8.05 మిలియన్ల ఖాతాదారులు నమోదు అయ్యారు. అక్టోబర్ మాసాంతానికి మొత్తం వైర్‌లెస్ (జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ మరియు డబ్ల్యూఎల్ఎల్) ఖాతాదారుల సంఖ్య 217.14 మిలియన్లకు చేరుకుంది.
అదే సమయంలో అక్టోబర్ మాసంలో వైర్‌లెస్ ఖాతాదారుల సంఖ్య 39.41 మిలియన్లు తగ్గిపోగా, సెప్టెంబర్ మాసంలో ఆ సంఖ్య 39.58 మిలియన్లుగా నమోదయ్యింది.
|