భారతీయ సాఫ్ట్‌వేర్ ఉత్పాదక కంపెనీ అయిన ఇన్‌స్టాకోల్ హైబ్రీడ్ ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ ఆఫీస్ సూట్ ఆఫ్ అప్లికేషన్లు -- లైవ్ డాక్యుమెంట్లను ఆవిష్కరించింది. వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్‌కు ధీటైన కార్యకలాపాలను ఆన్‌లైన్ ఆఫీస్ ప్రొడక్టివిటీ యొక్క పూర్తిస్థాయి విశేషాంశాలను కలిగిన లైవ్ డాక్యుమెంట్లు నిర్వర్తిస్తాయి.
ఫ్లాష్ మరియు ఫ్లెక్స్ తదితర అంతర్నిర్మితమైన ఆర్టీఏ టెక్నాలజీలను వినియోగించే లైవ్ డాక్యుమైంట్లు, ఎక్కడ నుంచైనా, ఏదేని ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఏదేని సర్వజనీన బ్రౌజర్‌పై వినియోగదారులు డాక్యుమెంట్లను వీక్షించడంతోపాటు వాటిని సంకలనం చేసేందుకు అనుమతిస్తాయి.
సంప్రదాయ సాఫ్ట్‌వేర్‌లోని అనుకూలిత అంశాలను కలిగి కొత్తగా విడులైన లైవ్ డాక్యుమైంట్లు ఇంటర్నెట్ తరానికి ఎంతగానో ఉపకరిస్తుందని కంపెనీ ఛైర్మన్ సబీర్ భాటీయా మీడియాతో అన్నారు.
|