ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
 
బస్సులలో శాటిలైట్ నావిగేషన్ పరికరాలు
FileFILE
బస్ వాయిస్, విన్నూత్నమైన వెహికల్ మానిటరింగ్ సిస్టమ్, దక్షిణ కర్ణాటక మరియు ఉడిపి జిల్లాలలో ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు బస్సులలో శాటిలైట్ నావిగేషన్ పరికరాలను నవంబర్ 23న ఏర్పాటు చేయతలపెట్టింది. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ను వినియోగించుకునే ఈ పరికరాలు ప్రతిరోజూ దాదాపు 40,000 మంది ప్రయాణికులకు వార్తలు మరియు వినోదాన్ని అందిస్తాయి.

తొలిదశలో 100 బస్సులలో బస్‌వాయిస్‌ను వ్యవస్థీకరించి, సంవత్సరకాలంలోగా 500 బస్సులలో బస్‌వాయిస్‌ను ఏర్పాటు చేస్తామని ఐ-ఫ్యాక్టర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రాజేష్ కుందేర్ మీడియాతో అన్నారు. బస్‌వాయిస్‌లోని శాటిలైట్ రిసీవర్లు జీపీఆర్ఎస్ నెట్‌వర్క్ ద్వారా ప్రాంతం, వేగం, దిశ మరియు ఆల్టిట్యూడ్ సంబంధిత శాటిలైట్ సమాచారాన్ని సెర్వర్లకు చేరవేస్తాయని రాజేష్ తెలిపారు.

స్వీకరించిన సమాచారంతో అనేక లొకేషన్-ఆధారిత సేవలను అందించేందుకు మార్గం సుగమం కాగలదని ఆయన అన్నారు.
మరిన్ని
వీఎస్ఎన్ఎల్ సిగ్నలింగ్ టవర్ల అనుసంధానం
ఇన్‌స్టాకోల్ కొత్త ఆఫీస్ సూట్ సాఫ్ట్‌వేర్
భారీ సంఖ్యలో టెలికాం ఖాతాదారులు
ఫలవంతం కాని టెలికాం చర్చలు
రిటైల్ రంగానికి ఐబీఎం సొల్యూషన్స్
ఐడీఎఫ్‌సీతో జీటీఎల్ ఒప్పందం