ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
 
తమిళనాడులో బిజినెస్ మెయిల్ సెంటర్లు
FileFILE
తమిళనాడు పోస్టల్ సర్కిల్‌లో మరో 29 బిజినెస్ మెయిల్ సెంటర్లను నెలకొల్పనున్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ (మెయిల్ మేనేజ్‌మెంట్) కె.రామచంద్రన్ ప్రకటించారు. స్థానికంగా కొత్త బిజినెస్ మెయిల్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోయంబత్తురులో ఏడు, చెన్నై, మధురై, కాట్పాడిలో ఒక్కొక్కటి చొప్పున బిజినెస్ మెయిల్ సెంటర్లు కార్యకలాపాలను సాగిస్తున్నాయని తెలిపారు.

తమిళనాడు పోస్టల్ విభాగం ప్రతి రోజు 25 లక్షల ఆర్డినరీ లెటర్లను నిర్వహిస్తుండగా, చెన్నై నగరం 13 లక్షల ఉత్తరాలు, 93,000 మనీయార్డర్లు, 1.15 లక్షల రిజిస్టర్‌డ్ ఉత్తరాలు, 16,000 స్పీడ్ పోస్టు ఆర్టికల్స్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత ఉత్తరాల సంఖ్య గణనీయంగా పడిపోయినప్పటికీ వాణిజ్యం మరియు కార్పొరేట్ మెయిళ్ల సంఖ్య ఆశించిన రీతిలో పెరుగుతున్నదని తెలిపారు.

అనంతరం పోస్ట్ మాస్టర్ (సెంట్రల్ రీజన్) ఎస్‌పీ. రాజలింగం మాట్లాడుతూ కరూర్, తంజావూరు, కుంబకోణం మరియు విల్లుపురంలలో వచ్చే సంవత్సరం మార్చిలోగా బిజినెస్ మెయిల్ సెంటర్లను ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిపారు.
మరిన్ని
ఐడియాకు ఐబీఎమ్ సొల్యూషన్
ప్రారంభమైన డియోగ్రాసియో కార్యకలాపాలు
స్పెక్ట్రమ్‌పై లేదు నిర్ణయం: రాజా
గల్ఫ్ ఆయిల్ ఐటీ పార్కు
ట్రాయ్ నిబంధనలు సరికాదు: మిట్టల్
ఆస్ట్రేలియాలో విప్రో ఐటీ సెంటర్