ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
 
నడిచే రైళ్లలో ఏటీఎం కేంద్రాలు: మంత్రి వేలు
దేశంలో నడుస్తున్న రైళ్లలో ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్) యంత్రాలను అమర్చనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఆర్.వేలు తెలిపారు. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఇ-టిక్కెటింగ్ ఏటీఎం కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేలు మాట్లాడుతూ.. నడిచే రైళ్లలో ఏటీఎం ఇ-టిక్కెటింగ్ యంత్రాలను ఏర్పాటు చేసే సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ రైళ్లలో ఏర్పాటు చేసే ఏటీఎంలకు రైల్వే శాఖ తగిన భద్రత కల్పిస్తుందన్నారు.

ఇందుకోసం ఏడు జాతీయ బ్యాంకులతో రైల్వై శాఖ ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి చెప్పారు. ఏటీఎంలకు అవసరమైన స్థలాన్ని రైల్వే శాఖ కల్పిస్తుందన్నారు. అంతేకాకుండా.. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్లాట్‌ఫారాల పొడగింపు, స్టేషన్‌లలో విశ్రాంతి కేంద్రాలు, తగిన మంచినీరు, విద్యుత్ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని మంత్రి వేలు చెప్పారు.
మరిన్ని
పరిశోధనలకు ఆర్థిక పరమైన అడ్డంకులు: అబ్దుల్ కలాం
సెల్ వినియోగంలో అ'ద్వితీయం' తిరుపతి
బెంగాల్ ఐటీరంగానికి నిపుణుల కొరత
తమిళనాడులో బిజినెస్ మెయిల్ సెంటర్లు
ఐడియాకు ఐబీఎమ్ సొల్యూషన్
ప్రారంభమైన డియోగ్రాసియో కార్యకలాపాలు