ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అనధికార సాఫ్ట్‌వేర్ వినియోగంపై కేపీఎమ్‌జీ నివేదిక
అనధికారికంగా, సంబంధిత కంపెనీ నుంచి లైసెన్సు పొందకుండా వినియోగదారులు చేపడుతున్న సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టలేషన్లతో ప్రపంచవ్యాప్తంగా గల సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఆదాయపరంగా తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనధికార సాఫ్ట్‌వేర్‌ వినియోగంతో కంపెనీలకు నష్టాలు అనే శీర్షికతో అంతర్జాతీయంగా ఆర్థిక సేవలను అందించే కంపెనీ కేపీఎమ్‌జీ ఒక సర్వేను చేపట్టింది. సర్వే తాలూకు నివేదికను త్వరలో వెలువరించనున్నది.

ఇంటర్నేషనల్ బిజినెస్ సాఫ్ట్‌వేర్ మేనేజర్స్ అసోసియేషన్ (ఐబీఎస్ఎమ్ఏ) సభ్యులైన సాఫ్ట్‌వేర్ కంపెనీలపై కేపీఎమ్‌జీ సర్వేను నిర్వహిస్తోంది. అంతేకాక సర్వేకు మరింత నిబద్ధత చేకూర్చే నిమిత్తం ప్రముఖమైన ఆరు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చెందిన కీలకమైన అధికారులతో ఇంటర్వ్యూలు జరిపింది. సాఫ్ట్‌వేర్ దుర్వినియోగాన్ని నివారించేందుకు ఉపకరించే 10 ప్రతిపాదనలను సర్వే నివేదికలో పొందుపరుస్తోంది.
మరిన్ని
నోకియా సీమెన్స్‌కు భారీ కాంట్రాక్టు
భువనేశ్వర్‌లో డీవీడీ తయారీ కేంద్రం
బీపీఓ పరిశ్రమను ఆదుకోవాలి : నాస్కామ్
బెంగుళూరులో ఇంటర్నెట్ సదస్సు
ఐబీఎమ్‌లో పెరగనున్న ఉద్యోగుల సంఖ్య
ఐనాటెక్‌‌ను కైవసం చేసుకున్న కాల్‌సాఫ్ట్