ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఫిలిప్పైన్స్‌లో విప్రో బీపీఓ కేంద్రం
ఫిలిప్పైన్స్‌లో గల సెబులో 45,000 చదరపు అడగుల విస్తీర్ణం గల బీపీఏ కేంద్రాన్ని విప్రో టెక్నాలజీస్ ప్రారంభించింది. మాకు సంబంధించిన అంతర్జాతీయ సేవల ప్రస్థానంలో ఫిలిప్పైన్స్ కేంద్రం స్థాపనతో ప్రధానమైన మైలురాయిని చేరుకున్నట్లయ్యిందని విప్రో అంతర్జాతీయ కార్యకలాపాల (బీపీఓ) ఉపాధ్యక్షుడు సంజీవ్ భాటియా గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

కొత్త కేంద్రంలో ఉపాధిని పొందిన 900 మంది ఉద్యోగులు వాయిస్ మరియు నాన్-వాయిస్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, హెచ్ఆర్ సేవలు, ఫైనాన్షియల్ మరియు అకౌంటింగ్ మరియు ప్రొక్యూర్‌మెంట్ సేవలను ఖాతాదారులకు అందిస్తారు.

అలాగే ఫిలిప్పైన్స్‌లో అదనంగా బీపీఓ కేంద్రాలను నెలకొల్పడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. గడచిన తొమ్మిది మాసాల కాలంలో రొమేనియా మరియు షాంఘైలలో గ్లోబల్ డెలవరీ కేంద్రాలను విజయవంతంగా స్థాపించినట్లు కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని
ఉచితంగా బిల్లులు-ట్రాయ్ మంతనాలు
ఐటీ సంవత్సరంగా కొత్త సంవత్సరం
బ్రాడ్‌బ్యాండ్ వేగంపై ట్రాయ్ స్థాయీ పత్రం
వృద్ధి చెందుతున్న మొబైల్ ఫోన్ల వినియోగం
ఇ-గవర్నెన్స్‌తో తగ్గిన అవినీతి : కేంద్ర మంత్రి
గుర్గావ్ పోలీసులకు డిజిటల్ వ్యవస్థ