ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్వాన్ ప్రాజెక్టు చేజిక్కించుకున్న తులిప్ ఐటీ
అస్సాం స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (స్వాన్) ప్రాజెక్టును పొందినట్లు తులిప్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. ప్రాజెక్టు విలువ రూ. 57.72 కోట్లుగా కంపెనీ పేర్కొంది. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ సరఫరా మరియు వ్యవస్థకరించడంతోపాటు ఐదు సంవత్సరాల కాలపరిమితికి ప్రాజెక్టు నిర్వహణా బాధ్యతలను తులిప్ చేపట్టవలసి ఉంటుంది.

డాటా, వాయిస్ మరియు వీడియోకు మద్దతు పలికే నెట్‌వర్క్‌తో రాష్ట్రంలో పలు ఇ-గవర్నెన్స్ కార్యకలాపాలకు నాంది పలకవచ్చునని ప్రకటనలో వెల్లడించింది. పూర్తి స్థాయిలో ఐపీ నెట్‌వర్క్ ఆధారితమైన ఈ ప్రాజెక్టు అత్యధిక సామర్ధ్యాన్ని కలిగి అస్సాం ప్రభుత్వం తాలూకు వర్తమాన మరియు భవిష్యత్ అవసరాలను తీర్చడంలో ఉపకరిస్తుందని తులిప్ సీఎమ్ఓ హెచ్ ఎస్ బేడీ తెలిపారు.
మరిన్ని
ఫిలిప్పైన్స్‌లో విప్రో బీపీఓ కేంద్రం
ఉచితంగా బిల్లులు-ట్రాయ్ మంతనాలు
ఐటీ సంవత్సరంగా కొత్త సంవత్సరం
బ్రాడ్‌బ్యాండ్ వేగంపై ట్రాయ్ స్థాయీ పత్రం
వృద్ధి చెందుతున్న మొబైల్ ఫోన్ల వినియోగం
ఇ-గవర్నెన్స్‌తో తగ్గిన అవినీతి : కేంద్ర మంత్రి