ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లక్ష కోట్ల రూపాయలతో ఐటీ మార్కెట్
భారత దేశపు దేశవాళీ ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవల మార్కెట్ ఆదాయం 2008 సంవత్సరంలో గణనీయమైన వృద్ధితో రూ. 1,10,000 కోట్లను అధిగమించవచ్చునని ప్రముఖ ఐటీ పరిశోధన సంస్థ ఐడీసీ ఇండియా పేర్కొంది. 2007 సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఐడీసీ ఇండియా కంట్రీ మేనేజర్ కపిల్ దేవ్ సింగ్ తెలిపారు.

బ్రిక్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా)లతో పాటు వెండర్లు కొత్త ప్రాంతాలకు చేరుకున్నప్పటికీ, వృద్ధిని సాధించడంలో భారత్ కేంద్ర స్థానంలో నిలుస్తుందని వెల్లడించారు. బ్రిక్ దేశాలు ఐటీ రంగంలో పరిణితిని సాధిస్తున్న నేపథ్యంలో నిలకడ కలిగిన వృద్ధిని సాధించే కొత్త ప్రాంతాలను అన్వేషించే దిశగా వెండర్లు ప్రయత్నాలు ప్రారంభించవలసి వస్తుందని సింగ్ పేర్కొన్నారు. 2006-2011 మధ్య కాలంలో బ్రిక్ దేశాలను అధిగమించే దశగా భారతీయ ఆదాయాలు వేగంగా వృద్ధి చెందే అవకాశం లేకపోలేదని తెలిపారు.
మరిన్ని
హర్యానాలో రిలయన్స్ ఐటీ ఇనిస్టిట్యూట్
క్రేన్స్ సాఫ్ట్‌వేర్ హస్తగతమైన అమెరికా కంపెనీ
హంగామా మొబైల్ పైరసీ నిరోధక సాఫ్ట్‌వేర్
కెన్యాకు ఐఎస్‌డీ రేట్లను తగ్గించిన ఎయిర్‌టెల్
రెండవ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎమ్‌డీ
టెలికామ్ కంపెనీలకు కాసుల పంట