అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో ఐటీ రంగాన్ని పరిపుష్టపరచుట అనే అంశంపై మూడు రోజుల పాటు జరుగునున్న హైదరాబాద్ ఐటీ సమ్మిట్ 2008 మార్చి 20న ప్రారంభం కానున్నది. జాతీయ, అంతర్జాతీయ విశ్లేషకులు, ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణులు, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కంపెనీలు, కీలకమైన పెట్టుబడిదారులు, ప్రస్తుతం మరియు భవిష్యత్ మౌలిక సదుపాయాల కల్పనాదారులు మరియు విధాన రూపకర్తలు సమ్మిట్‌లో పాల్గొని ఉన్నత స్థాయి సమావేశాలు మరియు ఇష్ఠాగోష్టులలో పాలుపంచుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ మరియు కమ్యూనికేషన్స్ శాఖ, భారత వాణిజ్య మరియు పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న సమ్మిట్, అంతర్జాతీయ ఐటీ పరిశ్రమలో కొనసాగుతున్న పరిణామాలు, ప్రస్తుత దశలో అభివృద్ధికి ఉపకరించే మౌలిక సదుపాయాలు కల్పనలో తలెత్తే డిమాండ్లపై దృష్టి కేంద్రీకరిస్తుంది. అదేసమయంలో చిన్న, మధ్య తరహా ఐటీ పరిశ్రమల అవసరాలపై సమ్మిట్ చర్చిస్తుంది.
|