అంతర్జాతీయ పారిశ్రామిక స్థాయి ఉత్పత్తుల సేవలను నిర్దేశిత గమ్య స్థానానికి చేర్చేందుకు ఉపకరించే అంతర్జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మద్దతు (జీఈపీఎస్) ఫోరమ్‌ను ప్రారంభిస్తున్నట్లు భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కు అనుబంధితమైన జ్ఞానం మరియు నైపుణ్యాల మిషన్ గురువారం ప్రకటించింది. భారత్‌లోని పుష్కలంగా లభిస్తున్న నైపుణ్య సామర్థ్యాన్ని అంతర్జాతీయ ఖాతాదారులకు సత్వరం అందించడంలో కొత్తగా ఏర్పాటైన ఫోరమ్ సమర్ధవంతమైన పాత్రను పోషిస్తుంది.
అవయా, సీఏ, ఈఎమ్‌సీ, ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ మరియు యాహూ తదితర ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో సీఐఐ కొత్త ఫోరమ్‌ను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ఈపీఎస్ సేవలకు సంబంధించి భారత్ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగడంతో ప్రస్తుతం ఉన్న 1.4 మిలియన్ అమెరికా డాలర్ల విలువ, 2012 నాటికి 10.7 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంటూ సీఐఐ అనుబంధిత ఐడీసీ ఒక నివేదికను విడుదల చేసింది.
|