భారత్‌లో ఐటీ సెక్యూరిటీకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 1.5 బిలియన్ యూఎస్ డాలర్ల వార్షిక సెక్యూరిటీ బడ్జెట్ కాకుండా భారత్‌లో పెట్టుబడులు పెంచేందుకు అంతర్జాతీయ దిగ్గజం ఐబీఎమ్ ప్రణాళికలు ప్రారంభించింది. ఐటీ సెక్యూరిటీ పరిశోధకులను నియమించే మూడు అంతర్జాతీయ కేంద్రాలలో భారత్‌ను ఒకటిగా ఐబీఎమ్ ఎంపిక చేసుకుంది. పూణే, బెంగుళూరులోని రెండు సాఫ్ట్‌వేర్ ల్యాబరేటరీలలో పెట్టుబడులను పెంచనున్నట్లు ఐబీఎమ్ వరల్డ్‌వైడ్ ఎవాంజలిస్ట్ ఫర్ సెక్యూరిటీ పియర్రే నోయెల్ మీడియాతో అన్నారు.
భారత్‌లో కొత్త సెక్యూరిటీ ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ఉపకరించే ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఐబీఎమ్‌కు చెందిన 1.5 బిలియన్ డాలర్ల సెక్యూరిటీ పథకం ఊతమిస్తుందని నోయెల్ తెలిపారు. దినదినాభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను మూడింతలు చేసే దిశగా 2009 నాటికి ఆరు బిలియన్ యూఎస్ డాలర్లను భారత్‌లో ఐటీ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు ఐబీఎమ్ 2006 సంవత్సరంలో ప్రకటించిన సంగతి విదితమే.
|