ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒరాకిల్‌కు బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్టు
భారతదేశంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సేవా రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు సంబంధించిన కాంట్రాక్టును సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ కైవసం చేసుకుంది. ఒరాకిల్‌తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించింది.

ఈ ఒప్పందంతో భవిష్యత్ సేవలతో పాటు సీబెల్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం), ఇతర అప్లికేషన్‌లు, డేటాబేస్ మరియు ఇతరాలు వంటి సర్వీసులను కూడా బీఎస్ఎన్ఎల్‌కు ఒరాకిల్ అందించనుంది. దీంతో తమ వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలను కలిగిన సేవలతో పాటు సంస్థ గణణీయంగా అభివృద్ధి సాధించగలదని బీఎస్ఎన్ఎల్ విశ్వసిస్తోంది.

న్యూఢిల్లీలో బీఎస్ఎన్ఎల్ సీఎండీ కులదీప్ ఘోయల్ మాట్లాడుతూ ఐటీ సేవలను విస్తృతంగా వినియోగదారులకు అందించవచ్చనే ఉద్ధేశ్యంతో తాము ఒరాకిల్ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్ స్థాయిని కలిగిన బీఎస్ఎన్ఎల్.. తన ఆధిపత్యాన్ని ఎప్పటికీ కొనసాగిస్తుందని, నాణ్యత కలిగిన భవిష్యత్ ప్రణాళికలను మరిన్ని రూపొందించి వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ సంస్థ.. 70 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి.
మరిన్ని
త్వరలో 'వెబ్‌దునియా' క్రీడా పోర్టల్
మొబైల్ వినియోగదారుల్లో అగ్రపథాన భారత్
భారీ ఒప్పందాలపై ఇన్ఫోటెక్ కన్ను
ఐ సిస్టమ్స్‌తో మైక్రో టెక్ ఒప్పందం
ఏసర్ స్వల్ప బడ్జెట్ పర్సనల్ కంప్యూటర్
ప్రేమ తీవ్రతను పసిగట్టే మొబైల్ సర్వీస్